మంచిరియల్ జిల్లా : తాండూర్ మండలంలో భూ కబ్జాకోరులు బరితెగిస్తున్నారు. తాండూర్ మండలంలోని ఓ ఇద్దరు ప్రజా ప్రతినిధులు రెచిని రైల్వే స్టేషన్ ఎదుట గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, పంపకాల్లో తేడా వచ్చి బహిరంగంగానే గొడవ పడ్డారని వార్తా పత్రికలలో కథనాలు వచ్చాయి. స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్ ప్రభుత్వ భూములో పాతిన ఫోళ్లను తొలగించి, ప్రభుత్వ భూమిలో చేపడుతున్న అక్రమ భవన నిర్మాణం ముందు ప్రభుత్వ భూమి అనే హెచ్చరిక బోర్డు పాతించారు. కానీ ఇప్పటివరకు అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయలేదు. నిన్న రాత్రి నుంచి ప్రభుత్వ భూమిలో పాతిన హెచ్చరిక బోర్డు కనిపించడం లేదు.