జగిత్యాల జిల్లా – మెట్పల్లి: అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి జర్నలిస్టుకు మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో స్పందించి, ఆయన కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్ అనారోగ్యానికి గురై నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు సోమవారం ఆసుపత్రికి వెళ్లి విజయ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ వంతు సహాయంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
తోటి జర్నలిస్టు అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆయనకు అండగా నిలవడం ద్వారా ప్రెస్ క్లబ్ సభ్యులు ఐక్యతను చాటుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, కష్టసమయాల్లో పరస్పర సహకారం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం మరోసారి తెలియజేసింది.
ఈ కార్యక్రమంలో మెట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూరం సంజీవ్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అజీమ్, గౌరవ సలహాదారు దాసం కిషన్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అఫ్రోజ్, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.








