సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మొన్న బీఎస్పీ పార్టీ నాయకులు గౌరవ మ్మెల్యే పైన చేసిన వాక్యాలను, నిరాధరమైన ఆరోపణలను తీవ్రంగా కండిస్తున్నాం, అని బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బిగుల్ల మోహన్, బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ,గౌరవ ఏమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసే అభివృద్ధి , ప్రజాధారణ ఓరువలేక దుష్ప్రచారం చేస్తునారు, ఇక ముందు ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సోషల్ మీడియా లో పెడితే ఊరుకునేది లేదు ఖబర్దార్,అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెప్యాల సంతోష్ , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గణపురం తిరుపతి, మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, నాయకులు లింగాల బాబు, నియోజకవర్గం విద్యార్ధి విభాగం ఉపాధ్యక్షులు బిగుల్ల సుదర్శన్, నాయకులు వడ్లురి పర్శరాములు, మామిండ్ల తిరుపతి, ఎస్సీ సెల్ కళ్లేపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మంకాల రాజు, కొంపెల్లి నారాయణ,కత్తి నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.