కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లోని హాన్మాజిపల్లి, బెజ్జంకి మండలంలోని బేగంపేట, రాంసాగర్, తలారివానిపల్లి, బెజ్జంకి గ్రామాలకు కు చెందిన 500ల మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆహ్వానించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మబోరన్నారు. తెలంగాణ లో మూడవ సారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎర్పాటు కాబోతుందన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని అన్నారు. తెలంగాణ ప్రజలు సారూ..కారూ..సర్కారు అనే నినాదంతో ఉన్నారని.. బీఆర్ఎస్ తోనే పేదల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, మానకొండూర్ నియోజవర్గ కన్వీనర్ లింగాల మహేందర్ రెడ్డి, మానకొండూరు నియోజవర్గ నాయకులు గడ్డం నాగరాజు, గన్నేరువరం మహిళా అధ్యక్షురాలు కుసుంబా నవీన, సంజివ్ రెడ్డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.