కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్సు వాహనాన్ని శుక్రవారం మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు, ఈరోజు నుంచి గన్నేరువరం మండలంలో ఉచిత ఆంబులెన్స్ సేవలు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు, అత్యవసర సేవలకై 8008888507 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. ఆక్సిజన్ సదుపాయంతో పాటు 24 గంటలు గన్నేరువరం మండలంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు, ఈకార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్, తిప్పర్తి పరిపూర్ణ చారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.