ప్రకాశం జిల్లా / ఒంగోలు టౌన్ : ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిధిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సకటాల ప్రదర్శన, విద్యార్థులచే నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సా రియా, జాయింట్ కలెక్టర్ ఎస్ గోపాలకృష్ణ, జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఇంకా పలువురు ప్రముఖులు, జిల్లా ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్నారు.