contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సమీక్షా సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన ఎల్ నినో ప్రభావాలపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొని పలు అంశాలపై అధికారులతో చర్చించారు.

ఎల్ నినో ప్రభావాల నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడే వాతావరణ మార్పులు, వాటి కారణంగా వ్యవసాయం, తాగునీటి వనరులు, ప్రజల జీవన విధానంపై పడే ప్రభావాలను సమగ్రంగా సమీక్షించారు. వర్షాభావం, పంటల నష్టం వంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు.

అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు రైతులకు అవసరమైన సహాయ చర్యలు, తాగునీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణరావు, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :