పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్‌కు అనుబంధంగా ఉన్న పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గం, పెదకూరపాడు మండలానికి చెందిన దైవ కృప పాస్టర్స్ ఫెలోషిప్ సేవకులు పి. నాగభూషణంకు చికిత్స నిమిత్తం రూ.2 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
పల్నాడు జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ నిర్ణయం మేరకు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందిన పాస్టర్ నాగభూషణంకు అండగా నిలిచేందుకు ఈ సహాయం అందించినట్లు ఫెలోషిప్ ప్రతినిధులు తెలిపారు.
అవసరంలో ఉన్న సేవకులకు సహాయం అందించడంలో ఏపీఎస్పీఎఫ్ – పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎల్లప్పుడూ ముందుంటుందని వారు పేర్కొన్నారు. సేవా భావంతో చేపడుతున్న కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కోర్ కమిటీ సభ్యులు పాస్టర్ కదురు జయరాజు, పెదకూరపాడు నియోజకవర్గ రీజనల్ ఇంచార్జి పాస్టర్ సౌపాటి రాజేంద్ర కుమార్, పెదకూరపాడు ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ సౌపాటి చిన్న చింతయ్య, బెల్లకొండ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ గడ్డం ప్రకాష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఫెలోషిప్ సభ్యులు, సహాయం అందుకున్న పాస్టర్ నాగభూషణం కుటుంబ సభ్యులు పల్నాడు జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.








