contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: పణితి రవికుమార్

పల్నాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్ పేర్కొన్నారు.

ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించిందని చెప్పారు.

సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’, యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రవికుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడిగా ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించారని ఆయన అన్నారు.

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా వెనుకబడిందని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపిస్తోందన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

‘స్వర్ణాంధ్ర–2047’ విజన్‌తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించగలిగామని పేర్కొన్నారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని రవికుమార్ అన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

చివరగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పణితి రవికుమార్ స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :