contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సృష్టికి నీరాజనం.. సంప్రదాయ వైభవం.. ‘సంకష్టహారచతుర్ధి

కాకినాడ :  సృష్టికి నీరాజనంగా, సనాతన సంస్కృతికి ప్రతీకగా ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజున నిర్వహించే సంకష్టహర చతుర్థి వ్రత పూజలు హిందూ కుటుంబాల ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని స్వయంభు భోగి గణపతి పీఠం పేర్కొంది. గురువారం పీఠంలో 19వ వార్షికోత్సవంలో భాగంగా 235వ సంకష్టహర చతుర్థి మాసోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం నుంచే 54 మంది భక్తులు ఉపవాస దీక్షతో సంకష్టహర చతుర్థి వ్రత పూజల్లో పాల్గొన్నారు. గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంపాక నైవేద్యాలను సమర్పించారు. అనంతరం చంద్రునికి అర్ఘ్యం సమర్పించి, గణపతి సహస్రనామ పారాయణం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి.

అడపా మేఘనమూర్తి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక నైవేద్య హారతి సమర్పించారు. అనంతరం వారు నివేదించిన ఉండ్రాళ్లు, పులిహోర, పరమాన్నం ప్రసాదాలను ప్యాకెట్ల రూపంలో బాటసారులకు పంపిణీ చేసి భక్తి సేవను చాటుకున్నారు.

పీఠం వ్యవస్థాపక ఉపాసకులు రమణరాజు–వరలక్ష్మీ దంపతులు మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ, పీఠంలో వరుసగా 19వ సంవత్సరంగా 235వ సంకష్టహర చతుర్థి మాస వ్రత పూజలు విజయవంతంగా నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. యువతీ యువకులు చతుర్థి వ్రత ఉపవాస దీక్షను ఆచరించడం ద్వారా జీవితంలో శుభఫలితాలు, యోగక్షేమాలు, భాగ్యసిద్ధి కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.

పద్మ, నాగమణి, విజయలక్ష్మి, సుబ్బలక్ష్మి, మంగ, వీరమణి, నూకరత్నం, విశాలాక్షి, శైలజ, మాహేశ్వరి, మాణిక్యం, రాజ్యలక్ష్మి, వెంకటేశ్వరి, సుజాత, రాజేశ్వరి, కామేశ్వరి, మధుప్రియ తదితర మహిళా భక్తులు పంచామృతాలతో గణపతికి అభిషేకాలు నిర్వహించి, ఆవునెయ్యి దీపాలు వెలిగించి, 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.

భక్తుల గణపతి నామస్మరణ, వేదపారాయణాలు, ప్రత్యేక పూజలు, ప్రసాద పంపిణీతో పీఠం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. సంకష్టహర చతుర్థి మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ముగిసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :