contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏ.పి.ఎస్.పి.ఎఫ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ (ఏ.పి.ఎస్.పి.ఎఫ్)కు అనుబంధంగా ఉన్న పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ మరోసారి సేవాభావాన్ని చాటుకుంది. జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ నిర్ణయం మేరకు చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం ఎల్-షద్దాయ్ పాస్టర్స్ ఫెలోషిప్‌కు చెందిన దైవసేవకుడు తానికొండ బాబురావుకు రూ.2,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

కొద్ది రోజుల క్రితం పాస్టర్ తానికొండ బాబురావు కాలు సెప్టిక్ కావడంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన వైద్య ఖర్చులకు తోడ్పాటుగా ఈ ఆర్థిక సహాయాన్ని పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అందించింది. అవసరంలో ఉన్న దైవసేవకులకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సేవకుల సంక్షేమం కోసం ఇలాంటి సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఫెలోషిప్ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ రెవరెండ్ కె. జీవన్ పాల్, నాదెండ్ల ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పాస్టర్ సి.హెచ్. ఆశీర్వాదం, స్థానిక ఫెలోషిప్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక ఫెలోషిప్ సభ్యులు, సహాయం అందుకున్న పాస్టర్ తానికొండ బాబురావు కుటుంబ సభ్యులు పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అవసర సమయంలో అందించిన ఈ సహాయం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :