contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

TDP Party : 30 ఏళ్ల పార్టీ సేవకు దక్కింది మొండిచేయేనా?

అరకులోయ: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు ఆడారి బారికి అర్జున్ ఎంపీటీసీ టికెట్ కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నప్పటికీ తనకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతూ, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని అర్జున్ తెలిపారు. చంద్రబాబు దత్త గ్రామ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందించానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ అభ్యర్థిత్వానికి సంబంధించి తనకు బీ-ఫారం ఇస్తామని ఎంపీ తేజ జ్యోతి హామీ ఇచ్చారని, అయితే చివరకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని ఆయన వాపోయారు.

“పార్టీ కోసం ఇన్నేళ్లు పనిచేసిన కార్యకర్తలకు ఇదేనా గుర్తింపు?” అంటూ అర్జున్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, టికెట్ల కేటాయింపు సమయంలో అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసిన తనకు జరిగిన అన్యాయంపై టీడీపీ పెద్దలు స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, స్థానికంగా పార్టీ టికెట్ల కేటాయింపు అంశం చర్చనీయాంశంగా మారింది. దీర్ఘకాలంగా పార్టీకి సేవ చేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇస్తారా? లేక ఎన్నికల సమీకరణాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారా? అనే చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :