contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సివిల్ రైట్స్ డే సందర్భంగా అవగాహన సదస్సు

మెదక్ జిల్లా – తూప్రాన్ : సివిల్ రైట్స్ డే సందర్భంగా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో కులవివక్ష నిర్మూలన, సామాజిక సమానత్వం, రాజ్యాంగబద్ధ హక్కులు, సామాజిక సామరస్యంపై గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, సమాజంలో కులం, మతం, వర్గం పేరుతో ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదని అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవించే బాధ్యత కూడా ఉందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపించే కులవివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావం, ఐకమత్యంతో జీవిస్తూ గ్రామాభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎక్కడైనా వివక్ష, అసమానతలు లేదా సామాజిక అన్యాయం జరిగినట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ సమావేశంలో తూప్రాన్ ఎస్‌ఐ వి. గంగరాజు, ఎస్‌ఐ మధుసూదన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఎస్సీ కమ్యూనిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ కులాలకు చెందిన గ్రామస్తులు పాల్గొన్నారు.

కార్యక్రమం ముగింపులో గ్రామస్థులు కులవివక్ష, సామాజిక అసమానతలకు గ్రామంలో ఎలాంటి అవకాశం ఇవ్వబోమని, అన్ని వర్గాల ప్రజలు సమాన గౌరవంతో జీవించే వాతావరణాన్ని నెలకొల్పేందుకు పరస్పర సహకారంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో శాంతియుత వాతావరణం, ఐకమత్యం కొనసాగిస్తూ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

సామాజిక సమానత్వం, పరస్పర గౌరవం, సోదరభావం ప్రతి గ్రామానికి బలమైన పునాది అని, కులవివక్షలేని సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని కార్యక్రమంలో పలువురు అభిప్రాయపడ్డారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :