contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిద్దలూరు మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

గిద్దలూరు : ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ) అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నికలో విజయం సాధించిన డాక్టర్ జాడి వెంకట నారాయణ (జేవీ నారాయణ) మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

అదే కార్యక్రమంలో పాలుగుళ్ల శ్రీదేవి వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు ఎన్నికైన 28 మంది వార్డు కౌన్సిలర్లు కూడా తమ పదవులపై ప్రమాణం చేశారు.

మున్సిపల్ కమిషనర్ ఇ.వి. రమణ బాబు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించగా, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో కార్యక్రమం సజావుగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన చైర్మన్ డాక్టర్ జాడి వెంకట నారాయణ మాట్లాడుతూ, గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, ప్రజా సేవల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :