contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాష్ట్ర రైతాంగ సమస్యలపై ప్రజా చైతన్యానికి సైకిల్ యాత్ర

గోదావరిఖని : రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి, విద్యుత్ సమస్యలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో చేపట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు సైకిల్ యాత్రకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఉద్యమకారులు బొడ్డు రవీందర్, ఉప్పు రాజ్‌కుమార్‌లను ఘనంగా సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యమకారులకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ముత్యం లక్ష్మణ్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని యాత్రకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

అనంతరం వ్యాల్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర కేవలం ప్రయాణం మాత్రమే కాదని, రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రజా ఉద్యమమని అన్నారు.

రాష్ట్రంలో సాగునీటి వనరుల వినియోగంలో ప్రభుత్వ వైఫల్యాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకపోవడం, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఆరోపించారు. నీటిని సముద్రంలోకి వదిలేస్తున్న పరిస్థితుల వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

ఈ సైకిల్ యాత్ర ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి, విద్యుత్ సమస్యలను ప్రజలకు వివరించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడే బీఆర్ఎస్ పార్టీ, రైతు సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ప్రతి ప్రజా ఉద్యమానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర ఒక కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొంటూ, యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రైతుల హక్కుల సాధన కోసం ఉద్యమకారులు చేస్తున్న కృషిని అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :