గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో 11 ఏళ్ల బాలుడు ఎలుక జశ్వంత్ యాదవ్ మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడి తల్లి రజిత వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న జశ్వంత్ అపస్మారక స్థితిలో కనిపించాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యుల చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, జశ్వంత్ తండ్రి ఎలుక నర్సయ్య కూడా ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు కూడా మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామస్థులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం.








