contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గోదావరిఖనిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, గోదావరిఖని టూ టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.34,110 నగదు, 8 సెల్‌ఫోన్లు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 26న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు 8 ఇంక్లైన్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో డబ్బులను పందెంగా పెట్టుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ బృందం గోదావరిఖని టూ టౌన్ పోలీసులతో కలిసి ఆకస్మికంగా దాడి చేసి అక్కడ పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో ఎస్సై దీకొండ రమేష్, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్, గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పట్టుబడిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు, పేకముక్కలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :