contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

గోదావరిఖని : గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగరేణి, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు.

దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్టేడియం పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌తో పాటు ప్రజల భద్రతకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను సంబంధిత శాఖలు సమకూర్చాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలు కుటుంబ సమేతంగా దసరా ఉత్సవాల్లో పాల్గొని ఆనందంగా పండుగను జరుపుకునేలా అవసరమైన ఏర్పాట్లన్నీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సీఐ ఇంద్రసేన రెడ్డితో పాటు సింగరేణి, మున్సిపల్ శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :