కరీంనగర్ టౌన్ – హనుమాన్ నగర్: హనుమాన్‌నగర్‌లోని బ్లూబెల్స్ హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్ జంగ సునీత మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రతిబింబించేలా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల చిన్నారులకు అవగాహన కల్పించడంతో పాటు మన పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడం ఇటువంటి వేడుకల ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థులు సంప్రదాయాలను గౌరవిస్తూ, మన సంస్కృతిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా సందేశాన్ని అందించారు.
విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి









