contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నారాయణ పాఠశాలలో ఘనంగా ముందస్తు దసరా వేడుకలు

పల్నాడు జిల్లా – మాచర్ల : స్థానిక నారాయణ పాఠశాలలో ముందస్తు విజయదశమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను ప్రతిబింబించేలా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, తోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేయడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ వేడుకలకు పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఏజీఎం జానకిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన బతుకమ్మ ఆటపాటలు, దుర్గాష్టమి నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా పండుగ విశిష్టతను, ఆయుధ పూజ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను అలరించాయి. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమం ముగింపులో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసింది. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేలా వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :