contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని డి.ఆర్.డి.ఏ అధికారులు…!

  • భర్త యాక్సిడెంట్ భీమా కోసం అంబెడ్కర్ పాదాలకు మొక్కి న్యాయం కోసం  వినతిపత్రం పాదాల వద్ద  ఉంచిన వితంతు యువతి…!
  • నాలుగు సంవత్సరాలుగా భర్త ప్రమాద భీమా డబ్బు కోసం జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న యువతి…!
  • పల్నాడు జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ఆదేశించినా కనికరించని డి.ఆర్.డి.ఏ అధికారులు…!
  • డి.ఆర్.డి.ఏ ఉద్యోగికి సగం ఇన్సూరెన్స్ డబ్బు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే 3 దఫాలుగా చర్చలు జరిపిన డి.ఆర్.డి.ఏ అధికారులు…!
  • విసిగిపోయి న్యాయం కోసం డా బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టిన దళిత యువతి..!

 

పల్నాడు జిల్లా వినుకొండ:  పట్టణం నరసరావుపేట రోడ్ లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష చేపట్టడం పట్టణంలో చర్చకు దారితీసింది. ఈ ఘటనతో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల పట్ల అధికారుల తీరు ఏ విధంగా ఉన్నదో ఈ సంఘటనతో తేటతెల్లం అవుతుంది. ఈ యువతి చేపట్టిన దీక్ష ప్రజలను, నిబద్ధత కలిగిన అధికారులను ఆలోచింపజేస్తుంది. చిన్న వయస్సులోనే భర్తను యాక్సిడెంట్ లో కోల్పోయింది. భర్త పేరుతో ఏ.పి., ప్రభుత్వం చేసిన ప్రమాద భీమా కోసం గత నాలుగు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా యుక్త వయసులో భర్తను పోగొట్టుకున్న యువతిపై సంబందిత అధికారులు ఏ మాత్రం కనికరం చూపకుండా గత నాలుగు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అందజేయు భర్త యాక్సిడెంట్ చంద్రన్న భీమా(వై.యస్.ఆర్ భీమా) డబ్బులు సగం తీసుకుని సగం ప్రభుత్వ ఉద్యోగియైన రాజశేఖర్ కు ఇవ్వాలని డి.ఆర్.డి.ఏ అధికారులు తేల్చి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో వినుకొండలోని డా బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహం ముందు బుధవారం నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు పరిశీలిస్తే వినుకొండ పట్టణానికి చెందిన శ్రీరామ్ శాంతి నిరుపేద కుటుంబానికి చెందిన యస్.సి సామాజిక వర్గానికి చెందిన యువతి, గత ఐదు సంవత్సరాల క్రితం ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన గరనేపూడి మహేష్ బాబుతో వివాహం జరిగింది. డి.ఆర్.డి.ఏ అధికారులు చంద్రన్న పెండ్లి కానుక డబ్బు శ్రీరామ్ శాంతి అకౌంట్ లో జమ చేశారు. వాస్తవానికి ఆడపిల్ల తల్లిదండ్రులకు ప్రభుత్వం చంద్రన్న కళ్యాణ కానుక అందజేస్తారు. రాజశేఖర్ డి.ఆర్.డి.ఏ లో పనిచేస్తుండటంతో అధికారులను మేనేజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. వివాహం జరిగిన సంవత్సరం తరువాత ఈపూరు మండలం కొత్త నెల్లూరు సమీపంలో శాంతి భర్త మహేష్ బాబు బైక్ యాక్సిడెంట్ లో  బైక్ పై నుండీ పడి కుక్కలు కరవడం వల్ల మహేష్ బాబు మరణించాడు. ఈపూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మహేష్ బాబుకు చంద్రన్న భీమా అప్పటికే ఉన్నది. మహేష్ బాబు తండ్రి డి.ఆర్.డి.ఏ లో ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తాను మహేష్ బాబు చంద్రన్న భీమాకు నామినిగా ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన కుటుంబ యాజమాని మరణిస్తే అతనిపై ఆధారపడి ఉన్న వారు ఇబ్బందులు పడకుండా వారికి ఆర్థిక సహాయం అందజేయడానికి ఈ భీమాను అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. చంద్రన్న భీమాలో ప్రభుత్వ ఉద్యోగియైన తండ్రి నామినీ గా ఉన్నప్పటికి ప్రభుత్వం పేద బాధితుల కోసం కల్పించిన ఇన్సూరెన్స్ కాబట్టి మరణించిన వ్యక్తి భార్య బ్రతికి ఉన్నప్పుడు భార్యను ఇన్సూరెన్స్ పొందుటకు హక్కురాలిగా స్థానిక డి.ఆర్.డి.ఏ అధికారులు సిఫారసు చేయాలి. వినుకొండ మండలం చీకటిగల పాలెంకు చెందిన ఒక వ్యక్తి మరణిస్తే మరణించిన వ్యక్తి భీమాకు అతని తమ్ముడు నామినిగా ప్రాధికారిక సర్వేలో నమోదు చేసి ఉన్నా మరణించిన వ్యక్తిపై ఆధారపడి ఉన్న భార్యను డి.ఆర్.డి.ఏ అధికారులు ఇన్సూరెన్స్ పొందుటకు అర్హురాలిగా మురబోయిన హనుమాయమ్మకు సిఫారసు చేసి అందజేశారు. శ్రీరామ్ శాంతి విషయంలో అలా జరుగ లేదు. శాంతి నిరుపేద కుటుంబానికి చెందిన యువతి అంతే కాకుండా వీరికి ఎటువంటి రాజకీయ ఆర్థిక బలం లేని నిస్సహాయత కలిగిన నిరక్షరాస్యులు ఈ విషయాలు ఆసరాగా తీసుకున్న డి.ఆర్.డి.ఏ ఉద్యోగి రాజశేఖర్ మరణించిన మహేష్ బాబుపై ఆధారపడి ఉన్న  భార్య జీవించి ఉన్నా కానీ తాను పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయ డి.ఆర్. డి.ఏ అధికారులే ఇన్సూరెన్స్ పొందుటకు సిఫార్సు ఉన్నతాధికారులకు చేయాల్సి ఉంటుంది కాబట్టి సంబంధిత అధికారులను లోబరచుకుని ఇన్సూరెన్స్ కి సిఫారసు చేసుకున్నాడు. శాంతి తనను నామినిగా చేర్చి న్యాయం చేయాలని భర్త మరణించిన తరువాత నామినీ గా తన పేరు చేర్చి భీమా ఇప్పించాలని డి.ఆర్.డి.ఏ స్థానిక, జిల్లా అధికారులను ప్రాధేయపడుతూ వినతిపత్రాలు అందజేస్తూనే ఉంది.  డి.ఆర్.డి.ఏ అధికారులు భాధితురాలైన శాంతి విన్నపాలు బుట్టదాఖలు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా అధికారులను వేడుకుంటూనే ఉన్నది మరణించిన వ్యక్తి పై ఆధారపడి ఉన్న భార్యకు ఇన్సూరెన్స్ పొందుటకు సిఫారసు చేయకుండా డి.ఆర్.డి.ఏ లో పనిచేస్తున్న రాజశేఖర్ కు ఇవ్వాలని డి.ఆర్.డి.ఏ స్థానిక అధికారులు ప్రలోభాలకు లొంగి సిఫారసు చేశారు. డి.ఆర్.డి.ఏ జిల్లా అధికారులు భాధితురాలైన శాంతి అభ్యర్ధనపై స్పందించలేదు సంబందిత అధికారులపై చర్యలు జిల్లా అధికారులు ఇప్పటికి తీసుకోలేదు. తన భర్త ఇన్సూరెన్స్ డబ్బు ప్రభుత్వ ఉద్యోగి పొందాలని, పల్నాడు జిల్లా డి.ఆర్.డి.ఏ కార్యాలయంలోని కొందరి ద్వారా ఫైల్ రీ ఓపెన్ చేసుకున్నాడని తెలుసుకున్న శాంతి గత డిసెంబర్ నెలలో రాష్ట్ర సెర్ప్ కార్యాలయంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసి గ్రీవిన్స్ లో కూడా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినా పల్నాడు జిల్లా డి.ఆర్.డి.ఏ అధికారులు న్యాయం చేయక పోవడంతో రెండు నెలల క్రితం డిసెంబరు నెలలో పల్నాడు జిల్లా కలెక్టర్ ను స్వయంగా కలిసి తన బాధను తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ శాంతి పేరు నామినిగా సెర్ప్ కార్యాలయానికి లేఖ పంపించాలని, రాజశేఖర్ కు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఫోన్ లో పల్నాడు జిల్లా డి.ఆర్.డి.ఏ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. డి.ఆర్.డి.ఏ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు సహితం పట్టించుకోకుండా బాధితురాలితో బేరసారాలకు దిగుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ పెడుతున్నట్లు బాధితురాలు వాపోతున్నది. ఇప్పటికి మూడు సార్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి పిలిపించి పంచాయతీ పెట్టినట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా సమాచారం అడిగినా సమగ్ర సమాచారం ఇవ్వలేదని సమాచార హక్కు చట్టంపై డి.ఆర్.డి.ఏ అధికారులు కనీస అవగాహన కూడా లేకుండా అతి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మొదటి అప్పీలు కూడా చేసినట్లు తేలిపింది. ఈపూరు తహసీల్దార్ FMC ప్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా జారీ చేశారని ఐనా డి.ఆర్.డి.ఏ అధికారులు న్యాయం చేయడం లేదని, గర్నెపూడి రాజశేఖర్ నెలకు 40 వేలు ప్రభుత్వం నుండీ జీతం తీసుకుంటూ తన భార్య పేరున జగనన్న చేయూత, ఆసరా తదితర పేదలకు అందజేసే స్కీములలో 60 వేళకు పైగా అక్రమంగా ప్రభుత్వ డబ్బులు తీసుకున్నాడని తనకు న్యాయంగా రావలసిన ప్రభుత్వ భీమా డబ్బులు కూడా పొందాలని ప్రయత్నం చేస్తున్నాడని కొందరు డి.ఆర్.డి.ఏ అధికారులు ఇతని అక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారని అంబెడ్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగింది. జిల్లా కలెక్టర్ చెప్పినా న్యాయం దక్కడం లేదని అంబెడ్కర్ విగ్రహం పాదాల వద్ద వినతి పత్రం పెట్టి దీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరగడం లేదని న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రం అంబెడ్కర్ పాదాల ముందు ఉంచింది. తనకు న్యాయం జరుగకపోతే విజయవాడలోని అంబెడ్కర్ విగ్రహం ముందు కూడా దీక్ష చేపడతానని తెలిపింది సియం కార్యాలయం ముందు కూడా తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకుంటానని తెలిపింది. ఈ సంఘటన పై పల్నాడు జల్లా కలెక్టర్ స్పందించి బాధితురాలికి న్యాయం చేసి భాద్యులపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడవలసిందే. శ్రీరామ్ శాంతి న్యాయ పోరాటానికి ప్రజా ప్రతినిధులు సామాజిక స్పృహ కలిగిన అధికారులు, ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు మద్దతు తెలిపి న్యాయం కోసం సహాయం చేయాలని శాంతి కోరుతున్నారు. ఈ న్యాయ పోరాటం విజయవాడలోని డా బి.ఆర్ అంబెడ్కర్ ప్రతిరూపం, సియం కార్యాలయం వరకు వెళుతుందో లేదో అధికారులు, ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచిచూడవలసిందే…!

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :