అమరావతి : వికలాంగుల మహా గర్జన చలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పేరు పోగు వెంకటస్వామి మాదిగ కోరారు. మార్చి 9 లో జరిగే చలో అమరావతి కార్యక్రమానికి వికలాంగులు వేలాదిగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తలపెట్టిన వికలాంగుల మహాగర్జనకు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మార్చి 9న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు గ్రౌండ్లో మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. వికలాంగుపించిన 6000 రూపాయలు చేయాలని శారీరక వికలాంగుల రోస్టర్56/36 మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారసాల కోటేశ్వరరావు మాదిగ, నండూరు బుజ్జిబాబు మాదిగ, బంకా బాబురావు మాదిగ, నందిగాంకా రమేష్ తదితరులు పాల్గొన్నారు.