పల్నాడు జిల్లా క్రోసూరు: ఆదివారం మేదరమెట్లలో జరగబోవు సిద్ధం సభను పెదకూరపాడు నియోజకవర్గము నుండి శాసనసభ్యులు నంబూరు శంకర్రావు సారధ్యంలో జయప్రదం చేద్దామని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గార్లపాటి దాసు పిలుపునిచ్చినారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను 99% శాతం హామీలను నెరవేర్చారని, గ్రామాలల్లో ప్రతి గృహానికి సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఇంటి నివేశన స్థలములు మంజూరు చేయడమే కాకుండా 16 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయడం,గ్రామాలల్లో నాడు నేడులో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేటర్ స్కూళ్లకు దీటుగా మార్చి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లో చదువులు అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి గ్రామములో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుచేసిన ఘనత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దేనని, జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకుందాం అలానే జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో నంబూరు శంకర్రావును గెలిపించుకుందామని, నియోజకవర్గము నుండి పెద్ద సంఖ్యలో సిద్ధం సభను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చినారు.