మదనపల్లి : ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖామంత్రి పవన్ కళ్యాణ్ నెత్రుత్వంలో గ్రామాల అభివృద్ధి పరుగులు తీస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ అన్నారు. శుక్రవారం మదనపల్లి మండలం అంకిశెట్టి పల్లె పంచాయతీ లో నిర్వహించిన గ్రామ సభ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ గ్రామసభలో పలు అంశాలపై చర్చించి సమస్యలను మదనపల్లి రెవెన్యూ అధికారులు నోట్ చేయడం జరిగింది.పప్పిరెడ్డ్డపల్లి టీచర్స్ కానీ లో ఉన్న కాలువ లో ఉన్న మంచి నీటి సంపు మార్పిడి, స్మశాన వాటిక అభివృద్ధి,రామాపురం లో కాలువ నిర్మాణం,టీచర్ కాలనీ లో బ్రిడ్జి నిర్మాణం,రోడ్డు నిర్మాణం, కొత్త వాటర్ సంపు ఏర్పాటు చేయడం ఇలా ప్రజలు చూపిన ప్రతి సమస్య అధికారులు నోట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్,ఎంపీటీసీ,ఏమ్ ఆర్వో, ఆర్ ఐ,మండల సర్వేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు.