నవమాసాలు మోసి పెంచి, ప్రయోజకులను చేసిన ఓ తల్లిని కసాయి పిల్లలు రోడ్డున పడేశారు. వివరాలలోకి వెళ్లితే జగిత్యాల జిల్లా శ్రీరామ్ నగర్ లో ముల్లె రాజవ్వ కు ఇద్దరు కొడుకులు.. అందరూ వెల్ సెటిల్.. ఏం లాభం.. కన్న తల్లిని చూసుకునే తీరిక లేదు. 40 ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే.. చివరి మెడ పట్టుకుని బయటకు గెంటేశారంటూ.. తల్లి పోలీసులను ఆశ్రయించింది. తనని కొడుతున్నారని గత 2 నెలల నుండి అన్నం పెట్టడం లేదని , బండ బూతులు తిట్టి ఇంటి నుంచి గెంటేశారని ముల్లె రాజవ్వ ఆవేదన ఆవేదన వ్యక్తం చేసింది.