కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఇక్కుర్తి రాజు కు 2020, లో తన మొదటి ప్రయత్నం లోనే సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. విదులు నిర్వర్తస్తూ ఖాళీగా ఉండకుండా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్లాలని దృఢంగా నిర్చయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా నిత్య విద్యార్థి లాగా ప్రతి విషయం నేర్చుకొని కష్టపడి ఈ సంవత్సరం 2024 మళ్ళీ జూనియర్ కళాశాల కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపక ఉద్యోగం సాంపాధించాడు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ నేటి యువత చెడు సావాసాలు మద్రక దవ్యాలతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలా కాకుండా చెడు అలవాట్లను పక్కనపెట్టి కృషి పట్టుదల సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వెళితే జీవితంలో ఏదైనా సాధించడం కష్టతరం కాదని తెలిపాడు. రాజు ను తోటి ఉద్యోగులు, స్నేహితులు గ్రామ ప్రజలు అభినందించారు.