ఆర్ జె వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత మదనపల్లి లోనే సీనియర్ నాయకుడు. ఈయన చదువుకునే రోజుల్లోనే బీటీ కాలేజ్ నందు విద్యార్థి సంఘం నాయకుడిగా తన ప్రస్తానానికి మొదలుపెట్టాడు మంచి వాక్యాతుర్యం కలిగిన ఈయన,1986 నుండి టిడిపిలో కొనసాగుతూ ఒకసారి సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు.తరువాత ఏడు సంవత్సరాలు నిమ్మలపల్లి సింగిల్ విండో అధ్యక్షులుగా గాను, జిల్లా కేంద్ర సహకార ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్గా పని చేసిన నాయకుడు. అదే సమయంలో తన భార్యను మాధవి లతను సర్పంచ్ గా గెలిపించుకున్నారు. వారు సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 19 సంవత్సరాల పాటు సేవలు అందించారు. అయితే గత 5సంవత్సరాల వైసీపీ పాలనలో బహిరంగా టిడిపి జెండా చేత పట్టి కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు ఆర్ జె వెంకటేష్. మదనపల్లి నియోజకవర్గంలోనే కాక రాజంపేట పార్లమెంటరీ పరిధిలో కార్యకర్తలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రత్యక్షంగా తాను అక్కడికి వెళ్లి ధైర్యాన్ని నెలకొల్పడం లక్ష్యంగా ఆయన పని చేశారు. ఆర్. జె.వెంకటేష్ కష్టాన్ని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం ఆయనను వివిధ కేసులు బనాయించి మానసికంగా దెబ్బతీయాలని ట్రై చేసింది. అయితే వైసీపీ నాయకులకు వైసీపీ ప్రభుత్వానికి తలవంచకుండా టీడీపి జెండా చేత పట్టి గ్రామ గ్రామాన తిరిగాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్. జె.వెంకటేష్ లోకల్ గా లేకపోయినా విదేశంలో ఉన్నా ఆయనని టార్గెట్గా చేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన చేస్తున్నటువంటి కార్యక్రమాలను జీనించుకోలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఆయనొక్క పొలానికి దారి ఇవ్వకుండా, ఉన్నదారిని అధికారం మదంతో జెసిబి సహాయంతో కాలువలు తవ్వించి తమ పొలానికి వెళ్ళనివ్వకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి.నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా, ఆర్జే వెంకటేష్ తూచా తప్పకుండా ముందుండి పార్టీ కార్యక్రమాలు అన్నిటిని సజావుగా జరప గలిగారంటే, పార్టీ మీద ఆయనకున్న గౌరవం,నిబద్ధత, నమ్మకం,ప్రేమ, ఇలా అన్ని విషయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ప్రత్యక్షంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ పార్టీ యొక్క భావాన్ని, ఆయన యొక్క భావజాలాన్ని మీడియా ద్వారా ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ గత ఐదు సంవత్సరాలు పోరాడిన వ్యక్తిగా, నాయకుడిగా ఆర్జే వెంకటేష్ నిలిచారు. ఇలాంటి వ్యక్తికి ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కార్యకర్తలకు అండగా నిలుస్తామని, పార్టీ కోసం పని చేసిన నాయకులకు గుర్తింపు ఉంటుందని చెప్తున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్. జె.వెంకటేష్ సేవలను, కష్టాన్ని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తారా లేదా కార్యకర్తగానే పని చేయించుకుంటారా అన్న విషయం వేచి చూడాలి