పల్నాడు : ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ (APSPF)కు అనుబంధంగా ఉన్న పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరోసారి సేవాభావాన్ని చాటుతూ ఆర్థిక సహాయం అందించారు. జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ నిర్ణయం మేరకు నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండల పాస్టర్స్ ఐక్యత ఫెలోషిప్‌కు చెందిన దైవసేవకుడు, మర్రిచెట్టుపాలెంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ బి. నిరీక్షణరావుకు రూ.2,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఫెలోషిప్ ప్రతినిధులు మాట్లాడుతూ, అవసరంలో ఉన్న దైవసేవకులకు అండగా నిలవడం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ మరియు పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా సేవకుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఫెలోషిప్ కోర్ కమిటీ సభ్యులు రెవరెండ్ పిక్కిలి సుబ్బారావు, నరసరావుపేట రీజనల్ ఇన్‌చార్జ్ రెవరెండ్ వేముల సమూయేలు, రొంపిచర్ల మండల ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు బ్రదర్ వేముల సాల్మన్ రాజు, స్థానిక కమిటీ సభ్యులు రెవరెండ్ ఎస్. రత్నపాల్, రెవరెండ్ ఎస్. దానియేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఫెలోషిప్ సభ్యులు, ఆర్థిక సహాయం అందుకున్న పాస్టర్ బి. నిరీక్షణరావు మరియు ఆయన కుటుంబ సభ్యులు జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అవసర సమయంలో అందించిన ఈ సహాయం తమకు ఎంతో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.








