గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకుడు ఆడెపు రాజేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 22వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్ ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఎండీ ముస్తఫా ఆడెపు రాజేశంకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









