ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నిర్వహించిన “దేశ్ కి బచావో – ఓట్ కి బచావో” మహా ర్యాలీలో రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో గోదావరిఖని, రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ ముస్తఫా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, బీసీ సెల్ చైర్మన్ కోదండ, రామాలయం చైర్మన్ గట్ల రమేష్, మైనారిటీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అసిఫ్ పాషా, ప్రచార కమిటీ చైర్మన్, 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము, సోషల్ మీడియా అధ్యక్షులు, 50వ డివిజన్ కార్పొరేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎండీ ముస్తఫా, బొంతల రాజేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ మహా ర్యాలీలో భాగస్వాములైన నాయకులు, కార్యకర్తలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.








