contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పవర్ హౌస్ కాలనీలో నూతన పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పవర్ హౌస్ కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పార్కును సోమవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణం అందించేందుకు పార్కులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు వాకింగ్ చేయడానికి, చిన్నారులు ఆటపాటలతో గడపడానికి ఇటువంటి పార్కులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పార్కుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, డీవైజీఎం (ఫారెస్ట్) కరుణ, సివిల్ డీవైజీఎం వరప్రసాద్, ఎస్‌ఓ టు జీఎం చంద్రశేఖర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :