contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రామగుండం సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొబేషనరీ డీఎస్పీలు

గోదావరిఖని : డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకుని ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించబడిన నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు బుధవారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రొబేషనరీ డీఎస్పీలు సీహెచ్. ఆది శేషు రెడ్డి, మహమ్మద్ తాజుద్దీన్, బి. ఐశ్వర్య, దుగ్గిరెడ్డి హరిప్రియలతో సీపీ ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు.

ప్రాక్టికల్ శిక్షణను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పోలీస్ స్టేషన్ల నిర్వహణ, నేరాల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనుభవజ్ఞులైన పోలీస్ అధికారుల నుంచి విధి నిర్వహణలోని మెళకువలను నేర్చుకుంటూ వృత్తిపరమైన నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన తెలిపారు.

పోలీస్ సేవలో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత అత్యంత ముఖ్యమైన విలువలని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సానుభూతితో వినాలని, బాధితులకు సత్వర న్యాయం అందించేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

శిక్షణ సమయంలో పొందిన అనుభవాన్ని భవిష్యత్తులో సమర్థవంతమైన పోలీసింగ్‌కు ఉపయోగించుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా సేవలందించాలని ప్రొబేషనరీ డీఎస్పీలకు సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రాక్టికల్ శిక్షణ ద్వారా ఆధునిక పోలీసింగ్ విధానాలు, ప్రజా సేవలో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉత్తమ అధికారులుగా ఎదగాలని సీపీ ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :