గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహారంలో ఒక వాట్సాప్ గ్రూప్ లో మాజీ దళిత నాయకుడు పెట్టిన మెసేజ్ పై సీనియర్ జర్నలిస్ట్ బుర్ర రాజ్ కోటి ఘాటుగా స్పందించారు.
“జర్నలిస్టులు తప్పుడు వార్తలు రాశారని” ఆరోపిస్తూ, దళిత సంఘం పేరు చెప్పుకుని జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
“ఏ పార్టీకి కొమ్ముకాయం. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడతారు. ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిస్తే అక్కడ న్యాయం కోసం పోరాటం చేస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్ పై కథనాలు వస్తూనే ఉంటాయి, అధికారులు తేల్చాలి. జర్నలిస్టులు ఎవరికీ భయపడరు, నిజాన్ని ప్రజల ముందు ఉంచుతారు” అని రాజ్ కోటి స్పష్టం చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుండగా, మధ్యలో జర్నలిస్టులను టార్గెట్ చేయడం సరికాదని ఆయన అన్నారు.








