మాచర్ల : ఇటీవల జరిగిన మాచర్ల పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన బండ్ల అనురాధను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు అభినందించారు.
ఈ సందర్భంగా బండ్ల అనురాధ, ఆమె భర్త బండ్ల బ్రహ్మం మర్యాదపూర్వకంగా యాగంటి మల్లికార్జున రావును ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించిన యాగంటి మల్లికార్జున రావు, స్వీట్లు తినిపించి విజయ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, 19వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
బండ్ల అనురాధ విజయం ప్రజల ఆశీర్వాదానికి, తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని యాగంటి మల్లికార్జున రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








