contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“ది రిపోర్టర్” టీవీ 2023 క్యాలండర్ ఆవిష్కరించిన మాచర్ల మున్సిపల్ కమీషనర్ రమణబాబు

పల్నాడు జిల్లా మాచర్ల : “ది రిపోర్టర్” టీవీ ముద్రించిన 2023 క్యాలెండర్ ని మాచర్ల మున్సిపల్ కమీషనర్ ఈవి రమణబాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని , అలాగే “ది రిపోర్టర్” వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో అందించేవిధంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. ప్రభుత్వం – ప్రజలకు మధ్య వారధి పత్రికలు, న్యూస్ ఛానల్స్ అని, ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువచేయడం లో న్యూస్ ఛానళ్ల పాత్ర ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో లీడ్ క్రాఫ్ట్ డైరెక్టర్ బూదాల మరియమ్మ, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు కంభంపాటి భాస్కరరావు, అక్షర భారతి సీఈవో పోలేపల్లి ఆనంద్, “ది రిపోర్టర్ టీవీ” రిపోర్టర్ నాగేంద్రబాబు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :