contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రోడ్ పక్కనే ధమ్…ఆదమరిస్తే దుమ్మె

తాడేపల్లి: రోడ్ పక్కనే ధమ్…ఆదమరిస్తే దుమ్మె..

ఈ బిర్యానీ హోటల్ ముందుగా ప్రయాణిస్తే ఎవరైనా *ధమ్అవ్వాల్సిందే*

తాడేపల్లి పాత జాతీయ రహదారిపై పొలకంపాడు వద్ద ఉంది ఈ హోటల్

నిత్యం వందలాది వాహనాలు సంచరించే మార్గమిది

పక్కనే ప్రమాదకరమైన ట్రాన్స్ఫార్మర్ ఆ పక్కనే ఎగసిపడే మంటలతో వంటలు

పైగా డేంజరస్ కర్వ్ ఉన్న ప్రాంతం

రోడ్డుకి రెండు అడుగుల దూరం కూడా ఉండదు

ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమాలు తొలగించిన అధికారులు

కానీ ఈ హోటల్ యజమాని మాత్రం రోడ్డు వరకు టెంటు వేసి భగభగ మండే మంటలు పెట్టి వంటలు వండుతూ నన్ను ఎవరేం చేస్తారులే అనే భావన

కట్టెల పొయ్యిపెట్టి పెద్దగా ఉవ్వెత్తున ఎగిసే మంటలతో పొగకు వాహనదారులను ఇబ్బందులు పడుతున్నా సరే బిర్యానీ వండుతారు

ఆ పక్కగా వెళ్తే మంటల సెగలతో పాటు కళ్ళల్లోకి పొగ జొరపడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి

ఇటీవల రెండు మూడు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి

రోడ్ పక్కన ఇలా బహిరంగంగా వంటశాలలు ఏర్పాటు చేసి హోటల్ నిర్వహిస్తుంటే అటు మున్సిపల్ అధికారులకు కానీ పోలీసు అధికారులుకు కానీ కనిపించలేదా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :