హైదరాబాద్: పట్టణంలోని అరుణ్యా భవనంలో దళారి సినిమా టీజర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరియు దళారీ సినిమా టీం తో కలిసి తిలకించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన దర్శకులు కాచిడి గోపాల్ రెడ్డి, నిర్మాత ఎడవల్లి వెంకట్ రెడ్డి సారధ్యంలో నిర్మించిన దళారి సినిమా టీజర్ ను తిలకించి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే దళారి సినిమా విడుదల కాబోతుందని తెలంగాణ ప్రజలు థియేటర్లో చూడాలని. దళారి టీజర్ బాగుందని అన్నారు. టీజర్ కు బాగా స్పందన వస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీజర్ చూడడం దానికి పాజిటివ్ గా స్పందించడం ఆనందంగా ఉందని గోపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హీరో పండు, గౌరీ శ్రీనివాస్, లైన్ ప్రొడ్యూసర్ అనిల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.