రీజినల్ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు శ్రీ చైతన్య పాఠశాల, ఎన్నెపల్లి, వికారాబాద్ మరియు శ్రీ చైతన్య పాఠశాల, శాంతినగర్, తాండూర్ అనే పై రెండు పాఠశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా 2022 – 23 చివరి పని దినం వరకు మాత్రమే నడపబడును. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2023 – 24 గాను పైన పేర్కొన్న శ్రీ చైతన్య పాఠశాలలు కొనసాగించుటకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకా దేవి ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించగలరని ఆమె తెలియజేశారు.