మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దనపల్లి ఏరియాలో గల ఆర్ఎస్ వైన్స్ లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి కాసిపేట పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఉదయం కాసిపేట ఎస్ఐ గంగారాం తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేసే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని ప్రశ్నించగా తమది పెద్దపల్లి జిల్లా అని ఇక్కడ దొంగతనం చేయడానికి రెక్కీ నిర్వహిస్తున్నామని తెలుపడంతో వారిని పోలీస్ స్టేషన్ కి తరలించి ఆర్ఎస్ వైన్స్ దొంగతనం గురించి ఆరాతీయగా అట్టి దొంగతనం తామే చేసినట్లు, చేసే ముందు అక్కడున్న మూడు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఇనుపరాడ్లతో షేటర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి రెండు మొబైల్ ఫోన్లు, ఇరవై వేల రూపాయల నగదు, లిక్కర్ బాటిల్స్ ఎత్తుకువెల్లినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు. దొంగతనానికి ఉపయోగించిన స్కూటీ, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని, నిందితులను జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం రిమాండ్ చేసి బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు.









