పెద్దపల్లి జిల్లా : అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి అధికారిని పట్టు పడింది. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ నుండి 60 వేల రూపాయలు తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్టర్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఎసిబి డిఎస్పి భద్ర ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో సైతం డాక్యుమెంట్ల కోసం నగదు తీసుకొని మరోసారి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈరోజు పట్టుకున్నారు.