రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామ సమీపంలో నిన్నటి రోజున ఆర్టీసీ బస్సు-ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో ప్రమాదానికి గురై గాయాలపాలైన క్షతగాత్రులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు మానకోండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా కవ్వంపల్లి సత్యనారయణ రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి బాధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను గురించి అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యచికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేటీఆర్ సోంత నియోజకవర్గం జిల్లా ప్రధాన ఆసుపత్రి లో ఎలాంటి సౌకర్యాలు లేక భాదితులు ప్రయివేటు ఆసుపత్రిలు చేరుతున్నారని 24 గంటలు గడుస్తున్న పట్టించుకోనే వైద్యుడు లేరని మండిపడ్డారు.ఆయన వెంట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షడు సంగీతం శ్రీనాథ్, మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షడు అంతగరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు పసుల వెంకటి,జిల్ల నాయకులు,బడుగు లింగం, బాలు,రెడ్డమల్ల బాను, దాసు తదితరులు పాల్గొన్నారు.