contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

మెదక్: జిల్లాలో భూ భారతి పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో భూ భారతి దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించారు.

ఆర్డీవోలు, తహసీల్దార్ల లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

అలాగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన భూ భారతి దరఖాస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల నుంచి అందిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆయా దరఖాస్తులు ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయో గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి అంబాదాస్ రాజేశ్వర్, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్లు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :