కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం : తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ త్వరలో జరగబోయే ఎన్నికలకు ఎమ్మేల్యే అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరొకసారి రాష్ట్ర సంస్కృతక సారధి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కి అవకాశం కల్పించిన శుభ సందర్భంగా గన్నేరువరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టి శ్రేణులు మండల కేంద్రానికి చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతూ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గంప వెంకన్న మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ రసమయి బాలకిషన్ కి మూడోసారి అవకాశం ఇచ్చిన శుభ సందర్భంగా సీఎం కేసీఆర్ కి, కేటిఆర్ కి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ మానకొండూరు గడ్డపై మూడోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తూ ఎమ్మెల్యే ని లక్ష మెజార్టీతో గెలిపించి రసమయి బాలకిషన్ ని మంత్రి చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, నాయకులు లింగాల మహేందర్ రెడ్డి,యూత్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కూన చంద్రశేఖర్, మానకొండూరు నియోజకవర్గం బేడ బుడగ జంగాల అధ్యక్షుడు టేకు అనిల్,ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తి అంజి,తదితరులు పాల్గొన్నారు.