మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తాండాకు వెళ్లే ప్రధాన రహదారిపై గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వడియారం రైల్వే బ్రిడ్జి గోడ కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సర్పంచ్ పకీర మీడియా తో మాట్లాడుతూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకొని బ్రిడ్జి గోడ నిర్మించి వెంటనే రాకపోకలు సాగే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.