contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌ ?

న్యూ ఢిల్లీ : తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీజేపీ అగ్రనాయకత్వం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రజినీకాంత్‌కు ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఆయన చరిష్మా పార్టీకి కలిసి వస్తుందని, ముఖ్యంగా తమిళనాడులో సీఎం స్టాలిన్‌ను కట్టడి చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై పట్టు ఉన్న రజినీకాంత్‌ను తెలంగాణ గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :