కరీంనగర్ జిల్లా: మానకొండూర్ ఎమ్మెల్యే గా మూడవ సారి కూడా నువ్వే గెలుస్తావ్ బిడ్డా…. మా మద్దతు నీకే అంటూ గన్నేరువరం మండల కేంద్రంలోని అన్నీ కులాల ప్రజలు గౌరవ మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ని అన్నీ కుల సంఘాల ప్రజలు మద్దతు తెలిపి ఆశీర్వదించి అండగా నిలిచారు. మూడవ సారి కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తావు బిడ్డా అంటూ సబ్బండ వర్గాల ప్రజలందరూ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించారు, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం-70మంది, రజక సంఘం-20మంది, పద్మశాలి సంఘం-30మంది, బుడిగ జంగం సంఘం-35మంది, మాల సంఘం, మాదిగ సంఘం-100మంది, కుమ్మరి సంఘం-20మంది, యాదవ సంఘం-46 మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్, నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పాల్గొన్నారు.