కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామంలో పాత ఎస్సీ కాలనీ లో మినీ అంబేద్కర్ సంఘ భవనాన్ని మంజూరు చేసి నిర్మాణాన్ని చేపట్టాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు జేరిపోతుల మహేందర్ గ ఆ సంఘ నాయకులతో కలిసి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి వినతి పత్రాన్ని ఇచ్చి అట్టి భవన నిర్మాణానికి సంబంధించిన ఖాళీగా ఉన్న జాగా విషయాన్ని తెలియపరచడం జరిగింది, దీనికిగాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ భువన ఏర్పాటుకు కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెదిరే.విజేందర్,ఉపాధ్యక్షుడు కల్లేపేల్లి కొమురయ్య, సభ్యులు జే.వెంకట్,నగునూరి సురేందర్,నర్సయ్య, చుక్కయ్య, ఇతర గ్రామాల అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.