contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరి పై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులు, ఉభయ దాతలు, స్థానికులతో ఆడి కృత్తిక ఏర్పాట్లపై ముందస్తుగా సమావేశం మంగవారం సాయంత్రం నిర్వహించారు. ఆడి కృతిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించి,భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని,ఆలయం పరిసరాల చుట్టూ శానిటేషన్ చేయించాలని,ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు.పోలీసు యంత్రాంగం ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉభయ దాతలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :