ప్రకాశం జిల్లా, ఒంగోలు రూరల్ : జిల్లాలో చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు నగర మరియు కొత్తపట్నం పియస్ పరిధిలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్ లను పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు గెస్ట్ హౌస్ కి వచ్చే వారి యొక్క పూర్తి వివరాలను నమోదు చేసే రిజిస్టర్, రూమ్స్ మరియు సీసీ కెమెరాలు పనితీరు తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో అధికారులు గెస్ట్ హౌస్ లకు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వారి యొక్క వివరాలను రిజిస్టర్ లో నమోదు పరచాలని, వారి యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు తీసుకోవాలని, గెస్ట్ హౌస్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన యాజమాన్యం వారిపై మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా అనుమానిత వ్యక్తులుగా అనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేక డయల్ 112 కు సమాచారం అందించాలని తెలియజేశారు.