పల్నాడు జిల్లా , కారంపూడి : భారత సైనికులు నిర్వహిస్తున్న లడఖ్ నుండి అండమాన్ నికోబార్ వరకు సైకిల్ ర్యాలీ నేడు కారంపూడి చేరుకుంది. స్థానికులు సైనికులకు ఘన స్వాగతం పలికారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి జిల్లా పరిషత్ పాఠశాల వరకు వారితో పాటు కూటమి నాయకులు,స్థానిక యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. అంతరం సమావేశం ఏర్పాటుచేసి వారితో పలు అంశాల పై చర్చించారు. అంతరం వారికి భోజన ఏర్పాట్లు చేసి వారి ప్రయాణం విజయవంతం కావాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకు, యువత పాల్గొన్నారు.